Breaking News
Home / National / సింహానికి ఎదురుగా కూర్చొని…..

సింహానికి ఎదురుగా కూర్చొని…..

న్యూఢిల్లీ: ఢిల్లీ జంతు ప్రదర్శనశాలలో ఒక వ్యక్తి సింహానికి ఎదురుగా కూర్చున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీ జంతు ప్రదర్శనశాలలో ఒక వ్యక్తి చుట్టూ ఉన్న కంచెను దూకి ఒక సింహం వద్దకు వెళ్లాడు. అంతేకాదు చాలాసేపు సింహం ఎదురుగా కూర్చున్నాడు. దానిని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడు. ఒక దశలో దాని ఎదురుగా నేలపై పడుకున్నాడు. కొద్దిసేపు గమనించిన సింహం తర్వాత అతడిపై దాడికి ఉపక్రమించింది. దీనిని గమనించిన సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకొని అతన్ని కాపాడారు. ఆ వ్యక్తిని బీహార్‌కు చెందిన రెహ్మన్‌ఖాన్‌గా గుర్తించారు. అతడికి మతిస్థిమితం సరిగాలేదని భావిస్తున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *