కావలసిన పదార్థాలు:
సజ్జ పిండి – 150 గ్రా., మిర్చి – 10 గ్రా., కొత్తిమీర – 5 గ్రా., పుదీన – 5 గ్రా., కార్న్‌ఫ్లోర్ – 15 గ్రా., బంగాళదుంప – 20 గ్రా., క్యారెట్ – 15 గ్రా., ఉల్లిపాయలు – 15 గ్రా., చిల్లి సాస్ – 25 మి.లీ., సోయా సాస్ – 25 మి.లీ., ఉప్పు – రుచికి తగినంత, నీళ్ళు – 60 మి.లీ.
తయారీ విధానం:
ముందుగా కూరగాయలను ఉడికించి మెత్తగా మెదుపుకోవాలి. వీటిని పిండిలో కలిపి తగినంత ఉప్పు, కార్న్‌ఫ్లోర్, కొత్తిమీర, పుదీనా ఆకులు వేసి అవసరమైతే కొద్దిగా నీళ్ళు పోసుకుని ముద్దలా కలుపుకోవాలి. చిన్నచిన్న ఉండలుగా చేసుకుని కాగుతున్న నూనెలో దోరగా వేయించాలి. మరొక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చిల్లీసాస్, సోయాసాస్ వేసి కొంచెం నీళ్ళు పోసి ముందుగా తయారు చేసుకున్న మంచూరియా వేసి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి. వీటిని వేడిగా తింటే బాగుంటాయి.