Breaking News
Home / States / తెలంగాణ రాష్ట్రం ప్రమాదంలో పడింది…

తెలంగాణ రాష్ట్రం ప్రమాదంలో పడింది…

మంచిర్యాల: ఆర్టీసీపై ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..  తెలంగాణలో రాజ్యాంగం, కోర్టులు లేనట్టుగా కేసీఆర్ భావిస్తున్నారని, కేవలం ఆర్టీసీనే కాదు తెలంగాణ రాష్ట్రమే ప్రమాదంలో పడిందన్నారు. హుజూర్‌నగర్‌లో వందల కోట్లు ఖర్చు చేసి టీఆర్ఎస్ గెలిచిందని మందకృష్ణ ఆరోపించారు. ఆ అహంకారంతోనే కేసీఆర్‌ మాట్లాడుతున్నారని, ఉప ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన…జనరల్ ఎన్నికల్లో గెలుస్తామనుకోవడం పొరపాటన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం భవిష్యత్‌లో పోరాటం చేస్తామని మందకృష్ణ స్పష్టం చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *