Breaking News
Home / National / స్మృతిని వెనక్కినెట్టిన న్యూజిలాండ్ క్రికెటర్…

స్మృతిని వెనక్కినెట్టిన న్యూజిలాండ్ క్రికెటర్…

దుబాయ్: ఐసీసీ వన్డే బ్యాట్స్‌వుమెన్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మందాన అగ్రస్థానాన్ని చేజార్చుకుంది. ర్యాంకింగ్స్‌లో మందానను వెనక్కినెట్టిన న్యూజిలాండ్ క్రికెటర్ అమీ సత్తర్ వైట్ టాప్ ర్యాంక్ దక్కించుకుంది. సౌతాఫ్రికాతో ఇటీవల జరిగిన వన్డే సిరీస్‌లో ఆమె ఆడలేదు. 23 ఏండ్ల బ్యాటర్ స్మృతి కాలి బొటనవేలుకు గాయం కావడంతో సౌతాఫ్రికాతో సిరీస్‌కు దూరమైంది. కెప్టెన్ మిథాలీరాజ్ కూడా ఏడో స్థానానికి పడిపోయింది. అంతర్జాతీయి క్రికెట్లో 20ఏండ్లు పూర్తి చేసుకున్న తొలి మహిళా క్రికెటర్‌గా ఆమె రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో జులన్ గోస్వామి, శిఖా పాండే, పూనమ్ యాదవ్ వరుసగా 6,8,9 స్థానాలకు దిగజారారు. ఆల్‌రౌండర్స్ విభాగంలో దీప్తీ శర్మ మూడో స్థానంలో నిలువగా శిఖా పాండే టాప్-10లో చోటు దక్కించుకుంది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *