జబర్దస్త్ షో అంటే నవ్వులే నవ్వులు.. ఎంతో మంది ఆర్టిస్టులకు మంచి జీవితాన్ని ప్రసాదించిన కార్యక్రమం అది. గురువారం నాడు ప్రసారమయ్యే జబర్దస్త్, శుక్రవారం నాడు ప్రసారమయ్యే ఎక్స్ట్రా జబర్దస్త్ షోలు ప్రేక్షకులకు కావాల్సినంత ఆనందాన్ని, నవ్వుల్ని పంచుతున్నాయి. ఆ షోలకు యాంకర్లుగా వ్యవహరిస్తున్న అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్ కూడా తమ అందాలను ప్రదర్శిస్తూ, తియ్యతియ్యని మాటలతో ఆ కార్యక్రమానికి మరింత గ్లామర్ పెంచేశారు. ప్రతీ వారం ప్రసారమయ్యే ఈ షో ద్వారా కొత్త వాళ్లు చాలా మంది బుల్లి తెర మీద కనిపిస్తుంటారు.
అయితే, తాజాగా.. సింగర్, తీన్మార్ మంగ్లీ కూడా జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. శుక్రవారం ప్రసారమయ్యే ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమంలో ఆమె కనిపించనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. అందులో మంగ్లీ గులాబీ రంగు డ్రెస్‌లో కనువిందు చేసింది.