Breaking News
Home / National / పాకిస్థాన్ వెళ్లనున్న మన్మోహన్ సింగ్‌…

పాకిస్థాన్ వెళ్లనున్న మన్మోహన్ సింగ్‌…

ఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌.. పాకిస్థాన్ వెళ్లనున్నారు. కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్ ప్రారంభోత్సవ వేడుకలో ఆయన పాల్గొననున్నారు. నవంబర్ 9వ తేదీన ఈ వేడుక జరగనున్నది. మాజీ ప్రధాని మన్మోహన్‌తో పాటు పంజాబ్ సీఎం మరీందర్ సింగ్ కూడా కర్తార్‌పూర్ వెళ్లనున్నారు. కొన్ని రోజుల క్రితం కర్తార్‌పూర్ ప్రారంభోత్సవానికి రావాలంటూ మన్మోహన్‌కు ఆహ్వానం అందింది. అయితే ఆ వేడుకలో పాల్గొనేందుకు మన్మోహన్ వెళ్లడం లేదని కాంగ్రెస్ వర్గాలు మొదట్లో వెల్లడించాయి. దీనిపై ఇవాళ మరో క్లారిటీ వచ్చింది. ఆఖిలపక్ష పార్టీ నేతలతో కలిసి పాక్‌కు మన్మోహన్ వెళ్లనున్నట్లు సమాచారం.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *