Breaking News
Home / National / మనోజ్ తివారీ రాజీనామా!…

మనోజ్ తివారీ రాజీనామా!…

న్యూఢిల్లీ : ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయానికి బాధ్యత వహిస్తూ బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు మనోజ్ తివారీ రాజీనామా చేశారా? పార్టీ వర్గాలు అవుననే అంటున్నాయి. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామాను పార్టీ అధిష్ఠానానికి సమర్పించినా… అధిష్ఠానం మాత్రం తిరస్కరించినట్లు సమాచారం. తొందరపడి ఎలాంటి నిర్ణయమూ తీసుకోకూడదని అన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో మనోజ్ కీలకంగా వ్యవహరించారు. ఒకానొక సమయంలో ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి అని కూడా బాగా ప్రచారంలోకి వచ్చింది. అయితే దీనిపై బీజేపీ అధిష్ఠానం ఎలాంటి సంకేతాలివ్వలేదు.

ఫలితాలు ఆప్ వైపుకే మొగ్గు చూపుతున్నా సరే… బీజేపీయే విజయం సాధిస్తుందని చివరి వరకూ  చెబుతూ, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడానికి సాయశక్తులా కృషి చేశారు. తమ పార్టీ ఓటమికి గల కారణాలను తాము విశ్లేషించుకుంటామని, తిరిగి ప్రజల్లోకి వెళ్లి పోరాడతామని తెలిపారు. ‘‘ఎన్నికల్లో మేము తగిన ప్రదర్శన ఇవ్వలేకపోయాం. దీనిపై విశ్లేషించుకుంటాం. అంచనాలకు తగ్గట్టుగా ఫలితాలు రాకపోతే కొన్నిసార్లు నీరసించిపోతాం. కానీ ఎవ్వరూ నిరుత్సాహపడకూడదని కోరుకుంటున్నాను. 2015 తో పోలిస్తే సీట్ల శాతం పెరిగింది. ప్రతీ కార్యకర్త దీనిని దృష్టిలో ఉంచుకోవాలి.’’ అని మనోజ్ తివారీ వ్యాఖ్యానించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *