Breaking News
Home / National / సీఎంపై పలు క్రిమినల్ కేసులు పెండిగ్ లో ఉన్నాయి….

సీఎంపై పలు క్రిమినల్ కేసులు పెండిగ్ లో ఉన్నాయి….

మహారాష్ట్ర: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు సుప్రీంకోర్టు జలక్ ఇచ్చింది. దీంతో సీఎం ఫడ్నవీస్ చిక్కుల్లో పడ్డారు. తన ఎన్నికల అఫిడవిట్‌లో క్రిమినల్ కేసుల గురించి వెల్లడించని కేసులో విచారణ చేపట్టాల్సిందే అని సుప్రీం పేర్కొన్నది. సీజేఐ రంజన్ గోగోయ్‌తో పాటు జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుధ్ బోస్‌లతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. బాంబే హైకోర్టు ఇచ్చిన క్లీన్ చిట్‌ను సుప్రీం తిరస్కరించింది. మహారాష్ట్రకు చెందిన సతీశ్ ఊకే .. సీఎం ఫడ్నవీస్‌పై కేసు దాఖలు చేశారు. ఫడ్నవీస్‌పై పలు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటి గురించి ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొనలేదని సతీశ్ కోర్టులో కేసు వేశారు. ఆ కేసులను రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్టులోని సెక్షన్ 125 ప్రకారం విచారణ చేపట్టాలని సుప్రీం ఆదేశించింది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *