హైదరాబాద్: తొలి తరం ఉద్యమ నాయకుడు కె.ఆర్.ఆమోస్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆమోస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆమోస్ మృతిపట్ల మంత్రులు ఈటల రాజేందర్, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డితో ఇతర ప్రజాప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నేతలు సంతాపం ప్రకటించారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. 1969 నుంచి తెలంగాణ కోసం సుదీర్ఘ పోరాటం చేశారన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
