Breaking News
Home / States / Andhra Pradesh / రాజమండ్రిలో మావోయిస్ట్ కామేశ్వరి అంత్యక్రియలు

రాజమండ్రిలో మావోయిస్ట్ కామేశ్వరి అంత్యక్రియలు

రాజమండ్రి: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న మావోయిస్ట్ కామేశ్వరి అలియాస్‌ స్వరూప పోలీసులు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. బుధవారం ఒడిస్సాలోని కోరాపుట్‌ జిల్లా పడువా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మావోయిస్టులు, పోలీసు బలగాలు, స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూపు మధ్య పెద్ద ఎత్తున ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మృతి చెందిన కామేశ్వరితో పాటు పలువురు మావోయిస్టులు మృతి చెందారు.

ఈ ఘటనలో చనిపోయిన కామేశ్వరిది తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం అయినాపురం గ్రామం. నేడు రాజమండ్రి కోటిలింగాల స్మశానవాటికలో స్వరూప అంత్యక్రియలు జరగనున్నాయి. రాజమండ్రి ఆర్టీసీలో కామేశ్వరి కండెక్టర్‌గా పనిచేసింది. ఆ సమయంలోనే మావోయిస్టులపై ఆకర్షితురాలై 2008–09లో కామేశ్వరి మావోయిస్టుల్లో చేరింది. అప్పటి నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తూ యాక్షన్‌ టీమ్‌ సభ్యురాలిగా మారింది.

Check Also

విజయసాయి రెడ్డి బుద్దా వెంకన్న విమర్శలు…

Share this on WhatsAppఅమరావతి: ట్విట్టర్ వేదికగా వైసీపీ, టీడీపీ నేతల మధ్య ట్వీట్ల యుద్ధం సాగుతోంది. తాజాగా వైసీపీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *