Breaking News
Home / Film News / తక్కువ బడ్జెట్‌ కానీ ఎక్కువ వసూళ్లు..

తక్కువ బడ్జెట్‌ కానీ ఎక్కువ వసూళ్లు..

నిజ జీవితంలో జరిగిన కిరాతకమైన అత్యాచారాల సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమే ‘ మర్దానీ 2 ‘. బాలీవుడ్‌ హీరోయిన్‌ రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం తొలిరోజు అంతంత మాత్రంగానే వసూలు చేసింది. ఇది చిత్రబృందాన్నిఅయోమయానికి గురిచేసినప్పటికీ అనూహ్యంగా రెండోరోజు విపరీత వసూళ్లను సాధించింది. సాధారణంగా ఏ సినిమానైనా విడుదలైన తర్వాతి రోజుల్లో 50 నుంచి 60 శాతం వసూళ్లు పుంజుకుంటాయి.

కానీ మర్దానీ 2 అందుకు భిన్నంగా రాకెట్‌ స్పీడులో రెండోరోజే 75 శాతం వసూళ్లు పుంజుకున్నాయి. ఈ సినిమా శుక్రవారం సుమారు రూ.4 కోట్లు అందుకోగా శనివారం ఏకంగా రూ. 6 కోట్ల పైచిలుకు సాధించింది. దీంతో ఇప్పటివరకు ఈ చిత్రం మొత్తంగా రూ.10 కోట్ల పైచిలుకు వసూళ్లు రాబట్టింది. ఇక బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ నటించిన ‘దబాంగ్‌ 3’ శుక్రవారం రిలీజ్‌ అవుతుండటంతో మర్దానీ 2 చిత్రానికి వసూళ్లు తగ్గే అవకాశం లేకపోలేదు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *