Breaking News
Home / World / అతిపిన్న వయసున్న మహిళా ప్రధానిగా మారిన్‌

అతిపిన్న వయసున్న మహిళా ప్రధానిగా మారిన్‌

అమరావతి న్యూస్: ఫిన్‌ల్యాండ్‌ ప్రధానిగా సన్నా మారిన్‌ రికార్డు క్రియేట్‌ చేయనున్నారు. 34 ఏళ్లకే ఆమె ప్రధాని బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రధాని బాధ్యతలు చేపట్టిన అతిపిన్న వయసున్న మహిళగా మారిన్‌ ఘనత సాధించనున్నారు. మహిళల నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి ఆమె సారథ్యం వహించనున్నారు. మాజీ ప్రధాని అంటి రిన్నే .. దేశంలో పోస్టల్‌ సమ్మెను సరిగా నియంత్రించలేకపోయారు. దీంతో ఆమె తన పదవి నుంచి తప్పుకుంటూ రాజీనామా చేశారు. మారిన్‌ త్వరలో ప్రధాని బాధ్యతలు స్వీకరించనున్నారు. న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా ఆర్‌డెర్న్‌ వయసు 39 ఏళ్లు కాగా, ఉక్రెయిన్‌ ప్రధాని ఒలేక్క్‌సీ హౌంచార్కు వయసు 35 ఏళ్లు.

Check Also

అంతుచిక్కని మరో వైరస్.. వందలాది మంది మృతి

Share this on WhatsAppతమ పొరుగు దేశం కజకిస్థాన్‌లో అంతుచిక్కని వైరస్‌ కారణంగా వ్యాధులు ప్రబలి, వందలాది మంది మృత్యువాత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *