Breaking News
Home / National / ప్రేమికులకు శుభవార్త…

ప్రేమికులకు శుభవార్త…

కోల్‌కతా : ప్రేమికులకు శుభవార్త… రిజిస్టరు పెళ్లి చేసుకోవాలనుకునే వధూవరులు ఇకపై ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లో పెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చంటున్నారు పశ్చిమబెంగాల్ రిజిస్ట్రేషన్ డిపార్టుమెంట్ అధికారులు. పెళ్లి చేసుకోవాలనుకునే వధూవరులు ఇకపై రిజిస్ట్రేషన్ కార్యాలయానికి రాకుండానే ఇంట్లో నుంచే ఆన్‌లైన్‌లో వారి వ్యక్తిగత వివరాలు నమోదు చేసి, ఐడీ, అడ్రసు ప్రూఫ్, వేలిముద్రలు, సంతకాలను అప్ లోడ్ చేయాలి. అనంతరం పెళ్లి రిజిస్ట్రార్ ను ఎంపిక చేసుకోవచ్చు. వధూవరుల పత్రాలను పరిశీలించిన తర్వాత రిజిస్ట్రార్ వధూవరుల ఫోన్ కు ఎస్ఎంఎస్, మెయిల్ పంపిస్తారు. అనంతరం ఫీజును ఆన్‌లైన్‌లోనే చెల్లించిన తర్వాత రిజిస్ట్రార్ వధూవరుల ఇంటికి వస్తారు. రిజిస్ట్రార్ ముగ్గురు సాక్షుల సమక్షంలో పెళ్లిని రిజిస్టరు చేస్తారు. అనంతరం వెంటనే మ్యారేజ్ సర్టిఫికెట్లను రిజిస్ట్రార్ జారీ చేస్తారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఏటా 1.3 లక్షలమంది పెళ్లిని రిజిస్ట్రేషన్ చేయించుకుంటుండగా ఈ ఆన్‌లైన్ సౌకర్యంతో వివాహాలను రిజిస్ట్రేషన్ చేయించుకునే వారి సంఖ్య పెరుగుతుందని మంత్రి మోలాయ్ ఘోటక్ చెప్పారు.

Check Also

పుచ్చలపల్లి సుందరయ్యకు నివాళులర్పించిన చంద్రబాబు

Share this on WhatsAppన్యూఢిల్లీ: కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్యకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *