Breaking News
Home / Crime / అంబర్‌పేటలో వివాహిత ఆత్మహత్య….

అంబర్‌పేటలో వివాహిత ఆత్మహత్య….

హైదరాబాద్ : అంబర్‌పేటలోని బాపునగర్‌లో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. అత్తమామలు, భర్త వేధింపులు భరించలేక మొబీన్ బేగం అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. మొబీన్‌కు నెల రోజుల క్రితమే వివాహమైంది. అయితే అత్తింటి వారి వేధింపులు భరించలేక ఇటీవలే ఆమె పుట్టింటికి వచ్చింది. పుట్టింట్లోనే మొబీన్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మొబీన్ ఆత్మహత్యపై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *