కృష్ణా: కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లికి చెందిన హిమబిందు అనే వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నూజివీడుకి చెందిన హిమబిందుకు ఉంగుటూరు మండలం వెల్దిపాడు గ్రామానికి చెందిన శ్రీనివాసరావుతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులు పెద్ద అవుటపల్లిలో అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్న క్రమంలో వారి మధ్య మనస్పర్థలు రావటంతో హిమబిందు ఆత్మహత్యకు పాల్పడిందని బంధువులు వెల్లడించారు.
