Breaking News
Home / States / తిరుపతి తీసుకెళ్లలేదని అలిగి ఆత్మహత్య….

తిరుపతి తీసుకెళ్లలేదని అలిగి ఆత్మహత్య….

బంజారాహిల్స్‌: విమానంలో తిరుపతి తీసుకెళ్లలేదని అలిగి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. గుంటూరుకు చెందిన ఎన్‌.ప్రవళ్లిక(30) మాదాపూర్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తోంది. ఆమె 2014లో ఎస్పీఆర్‌హిల్స్‌ రాజీవ్‌గాంధీనగర్‌కు చెందిన వెంకటరమణను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇద్దరూ రాజీవ్‌గాంధీనగర్‌లో ఉంటున్నారు. వీరికి ఒక కుమార్తె రిత్విక. ఈ నెల 10న రిత్విక పుట్టు వెంట్రుకలు తీసేందుకు వెంకటరమణ కుటుంబంతో సహా తిరుపతి వెళ్లేందుకు రైలు టిక్కెట్‌ బుక్‌ చేసుకున్నారు.

అయితే అనివార్యకారణాలతో ప్రయాణం వాయిదా పడింది. అయితే అందుకు అంగీకరించని ప్రవళ్లిక ఇద్దరం కలిసి విమానంలో తిరుపతి వెళ్లి వద్దామని కోరింది. అందుకు వెంకటరమణ అంగీకరించకపోగా వారం తర్వాత తన తల్లిదండ్రులతో కలిసి రైలులో వెళ్దామని నచ్చజెప్పాడు. ఈ నేపథ్యంలో గత రెండ్రోజులుగా వారి మధ్య గొడవ జరుగుతోంది. డ్యూటీనుంచి ఇంటికి వచ్చిన తర్వాత గదిలోకి వెళ్లి గడియ వేసుకుంది. వెంకటరమణ లోపలికి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దీంతో అతను ఆమెను కిందకు దింపి మోతీనగర్‌లోని నీలిమ ఆసుపత్రికి తీసుకెళ్ళగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *