Breaking News
Home / Education / ప్రభుత్వ పాఠశాలల్లో మార్షల్‌ ఆర్ట్స్‌….

ప్రభుత్వ పాఠశాలల్లో మార్షల్‌ ఆర్ట్స్‌….

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులకు ఆత్మరక్షణపై శిక్షణ ఇప్పించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. కరాటే, కుంగ్‌ఫూ, జూడో వంటి మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో అవసరమైన చర్యలు చేపట్టాలని ఆర్జేడీలకు, అన్ని జిల్లాల డీఈవోలకు పాఠశాల విద్యా కమిషనర్‌ విజయ్‌కుమార్‌ ఆదేశాలు జారీచేశారు. 100కు పైగా విద్యార్థినులున్న పాఠశాలల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని స్పష్టం చేశారు. ఒక్కో పాఠశాలకు రూ.9 వేల చొప్పున రూ.1.38 కోట్లు సమగ్ర శిక్షా అభియాన్‌ కింద కేటాయించారు. 31 ప్రాథమికోన్నత పాఠశాలలు, 1,513 ఉన్నత పాఠశాలలు మొత్తంగా 1,544 పాఠశాలల్లో విద్యార్థినులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణను ఈనెలలో ప్రారంభించి ఫిబ్రవరి వరకు నిర్వహించాలని ఆదేశాల్లో స్పష్టంచేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *