Breaking News
Home / Film News / హీరోగా అలరించనున్న మాస్ డైరెక్టర్…

హీరోగా అలరించనున్న మాస్ డైరెక్టర్…

ఫిల్మ్ న్యూస్: యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ గా నిలిచే వివి వినాయక్..ఇప్పుడు హీరోగా తెరపై కనిపించబోతున్నాడు. చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో మాస్ చిత్రాలు చేసి మాస్ డైరెక్టర్ అనిపించుకున్న ఈయన ఇప్పుడు హీరోగా కనిపించబోతున్నాడు. డైరక్టర్ శంకర్ అసిస్టెంట్ నరసింహారావు అనే కొత్త డైరెక్షన్లో వినాయక్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

ఈ నేపథ్యంలో ఈరోజు వినాయక్ పుట్టిన రోజు సందర్భాంగా చిత్ర టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోయే ఈ చిత్రానికి సీనయ్య అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఈ లుక్ లో వినాయక్ చేతిలో ఓ పనర్ పట్టుకొని మెడలో ఎర్రటి రుమాళ్ వేసుకొని యాక్షన్ హీరో గా కనిపించాడు. మణిశర్మ సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ ఫై దిల్ రాజు నిర్మిస్తున్నారు. త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుందని చిత్ర యూనిట్ తెలిపింది.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *