Breaking News
Home / Crime / ప్రార్థనల సమయంలో భారీ పేలుడు.. 65 మంది దుర్మరణం

ప్రార్థనల సమయంలో భారీ పేలుడు.. 65 మంది దుర్మరణం

కాబూల్: తూర్పు ఆఫ్ఘనిస్థాన్‌లోని ఓ మసీదులో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన పేలుడులో 65 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 36 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను హస్కామినా ప్రాంతంలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, పేలుడు సంభవించిన నంగర్‌హర్ ప్రావిన్స్‌లో తాలిబన్, ఐసిస్ ప్రాబల్యం బలంగా ఉన్నప్పటికీ ఈ పేలుడుకు ఇప్పటి వరకు ఏ సంస్థా బాధ్యత వహించలేదు.

ఆఫ్ఘనిస్థాన్‌లో హింస పెచ్చుమీరిందని, ఈ కారణంగా సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఐక్యరాజ్య సమితి గురువారం ప్రకటించగా, ఆ మరుసటి రోజే ఈ పేలుడు జరగడం గమనార్హం. కాగా, ఈ ఏడాది జూలై-సెప్టెంబరు మధ్య కాలంలో హింస కారణంగా ఆఫ్ఘనిస్థాన్‌లో ఏకంగా 1174 మంది ప్రాణాలు కోల్పోగా, 3139 మంది గాయపడినట్టు ఐక్యరాజ్య సమితి ఓ నివేదికలో పేర్కొంది. గతేడాదితో పోలిస్తే ఇది ఏకంగా 42 శాతం ఎక్కువ కావడం గమనార్హం.

Check Also

కళ్లు మూసుకుపోయిన కామాంధుడు.. ఆవుపై అఘాయిత్యం

Share this on WhatsAppకామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. పశువులు కూడా సిగ్గుపడేలా వ్యవహరించాడు. మూగజీవి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *