Breaking News
Home / National / సీఏఏ-ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా భారీ ర్యాలీ…

సీఏఏ-ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా భారీ ర్యాలీ…

బెంగుళూరు: పౌరసత్వ సవరణ చట్టం (ఎన్ఆర్‌సీ), జాతీయ పౌర పట్టిక(సీఏఏ)లకు వ్యతిరేకంగా బెంగుళూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని టౌన్‌ హాల్‌కు వేల సంఖ్యలో వచ్చిన నిరసనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున నినాదాలు చేస్తూ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితమే బెంగుళూరులో ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా పెద్ద ర్యాలీ నిర్వహించారు. నిత్యం నిరసనలు కొనసాగుతూనే ఉన్నా.. నేడు మరోసారి వేల సంఖ్యలో గుమిగూడిన నిరసనకారులు మరో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్ఆర్‌సీ, సీఏఏలకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో ప్రారంభమైన ఈ నిరసనలు చూస్తూ ఉండగానే దేశవ్యాప్తమయ్యాయి. ఈ నిరసనల్లో క్రమంగా రాజకీయ జోక్యం పెరిగిపోయి దేశంలో పెద్ద ఉద్యమంగా మారిపోయింది.

Check Also

రాజస్థాన్ రాష్ట్రంలో మిడతల దండు దాడి

Share this on WhatsAppరాజస్థాన్ రాష్ట్రంలోని బార్మేర్ జిల్లాపై మిడతల దండు దాడి చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బార్మేర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *