తూర్పు గోదావరి: తూర్పు గోదావరి జిల్లా, తునిలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరవీరులైన పోలీసులకు ఘనంగా నివాళులు అర్పించారు. సోమవారం ఉదయం నాయకులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.రమేష్ బాబు, ఎస్ఐ అజరు బాబు, తదితరులు పాల్గొన్నారు.
