Breaking News
Home / States / విద్యుత్తు సంస్థలో భారీగా కొలువుల భర్తీ…

విద్యుత్తు సంస్థలో భారీగా కొలువుల భర్తీ…

హైదరాబాద్: విద్యుత్తు సంస్థ(టీఎస్ఎస్‌పీడీసీఎల్)లో భారీగా కొలువుల భర్తీ జరగనుంది. ఇందుకు 10వ తరగతి, ఐటీఐ, డిగ్రీ అర్హతలుండాలి. జూనియర్ లైన్‌మెన్, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు కొద్ది రోజుల క్రితమే జారీ అయ్యాయి. మొత్తం 3,025 ఖాళీలను ప్రకటించింది. ఎప్పట్నుంచో నిరుద్యోగులు నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వేర్వేరు నోటిఫికేషన్లు వచ్చాయి. ఆసక్తిగల అభ్యర్థులు సంబంధిత వెబ్‌సైట్‌లలో నోటిఫికేషన్ చూడొచ్చు.

జేపీఓ, జేఎల్ఎం పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 22 న, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు ఈ నెల 31న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి…

* మొత్తం ఖాళీలు – 3,025
* జూనియర్ లైన్‌మెన్ – 2,500
* జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ – 500
* జూనియర్ పర్సనల్ ఆఫీసర్ – 25
* జేపీఓ, జేఎల్ఎం పోస్టులకు ఫీజు పేమెంట్ ప్రారంభ తేదీ – అక్టోబర్ 21
* జేపీఓ, జేఎల్ఎం పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ – అక్టోబర్ 22
* ఫీజు చెల్లించడానికి చివరి తేదీ – నవంబర్ 10, సాయంత్రం 5 గంటలు
* దరఖాస్తులకు చివరి తేదీ – నవంబర్ 10
* హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ – డిసెంబర్ 5
* పరీక్ష తేదీ – డిసెంబర్ 15
* జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు ఫీజు పేమెంట్ ప్రారంభ తేదీ – అక్టోబర్ 30
* జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం – అక్టోబర్ 31
* ఫీజు చెల్లించడానికి చివరి తేదీ – నవంబర్ 20 సాయంత్రం 5 గంటలు
* దరఖాస్తులు సబ్మిట్ చేయడానికి చివరి తేదీ – నవంబర్ 20
* హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ – డిసెంబర్ 11
* పరీక్ష తేదీ – డిసెంబర్ 22
* జూనియర్ లైన్‌మెన్ – 10వ తరగతి, ఎలక్ట్రికల్ ట్రేడ్ / వైర్‌మెన్ ట్రేడ్‌లో ఐటీఐ లేదా ఇంటర్మీడియట్‌లో ఎలక్ట్రికల్ ఒకేషనల్ కోర్స్.
* జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ – గ్రాడ్యుయేషన్
* జూనియర్ పర్సనల్ ఆఫీసర్ – బీఏ, బీకామ్, బీఎస్సీలో ఫస్ట్ క్లాస్ డిగ్రీ
* వయస్సు – జూనియర్ లైన్‌మెన్ పోస్టులకు 18 నుంచి 35 ఏళ్లు, జూనియర్ పర్సనల్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు 18 నుంచి 34 ఏళ్లు.
* ఫీజు – అప్లికేషన్‌కు రూ.100, పరీక్షకు రూ.120.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *