Breaking News
Home / National / ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు భారీ స్పందన…

ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు భారీ స్పందన…

జమ్ముకాశ్మీర్‌ : జమ్ము కాశ్మీర్‌లో నిర్వహించిన ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌కు కాశ్మీర్‌ యువత నుంచి పెద్దయెత్తున స్పందన కనిపించింది. సరిహద్దు ప్రాంతంలో విధులు నిర్వహించే టెర్రిటోరియల్‌ ఆర్మీ బెటాలియన్‌లో చేరడానికి 20 వేలమందికి పైగా యువకులు వచ్చారు. జమ్ము కాశ్మీర్‌లోని వివిధ జిల్లాలనుంచి, ప్రత్యేకించి బారాముల్లా నుంచి యువత అధిక సంఖ్యలో సైన్యంలో చేరడానికి ఉత్సుకత చూపించారు. రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌కు ఆఖరు రోజైన సోమవారం నాడు బారాముల్లా జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో యువత ఇంటర్వ్యూకు హాజరయ్యారని భారత సైన్యంలోని చినార్‌ కార్ప్స్‌ పేర్కొంది. సైన్యంలో చేరడానికి వచ్చిన వారందరూ మాతృభూమికి సేవ చేయాలనే ఉత్సాహంతో ముందుకు వచ్చారని, తమ ముందు ఎలాంటి సవాళ్లు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని చినార్‌ కార్ప్స్‌ పేర్కొంది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *