విశాఖపట్నం: టీం ఇండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సఫారీ బౌలర్లపై విజృంభిస్తున్నాడు. విశాఖపట్నం వేదికగా భారత్, దక్షిణ ఆఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో మయాంక్ డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. రోహిత్ శర్మతో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పిన మయాంక్.. 371 బంతుల్లో 215 పరుగులు చేసి ఎల్గర్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. కాగా.. మయాంక్ కెరీర్లో ఇదే అత్యత్తమ స్కోరు కావడం విశేషం. ఇప్పటి వరకు టీంఇండియా 5 వికెట్ల నష్టానికి 439 పరుగులు పూర్తిచేసింది.
