Breaking News
Home / National / మాయావతి ఎక్కడి నుంచి పోటీ చేస్తారంటే?

మాయావతి ఎక్కడి నుంచి పోటీ చేస్తారంటే?

లక్నో : బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి ఉత్తరప్రదేశ్‌లోని రిజర్వ్‌డ్ నియోజకవర్గమైన నగీనా నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎస్పీ, బీఎస్‌పీ కూటమి అభ్యర్థిగా ఆమె బరిలోకి దిగుతారు. నాలుగుసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన మాయావతి 2017 జూలై 18న రాజ్యసభకు రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆమె లోక్‌సభలో కానీ, రాజ్యసభలో కానీ సభ్యురాలు కాదు. లోక్‌సభలోనూ ఆ పార్టీకి ప్రాతినిద్యం లేదు. ఈ నేపథ్యంలో యూపీ లోక్‌సభ ఎన్నికల పొత్తులో భాగంగా నగీనా లోక్‌సభ నియోజకవర్గం నుంచి మాయావతి పోటీచేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

మాయావతి 1989లో బిజ్‌నూర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత రాజ్యసభ ఎంపీ అయ్యారు. అక్బర్‌పూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. కాగా, నియోజకవర్గాల పునర్విభజన కారణంగా అక్బర్‌పూర్, బిజ్‌నూర్‌లను రిజర్వ్‌డ్ నియోజకవర్గాల నుంచి తప్పించారు. అయితే బిజ్‌నూరు నియోజకవర్గంలోని 60 శాతం నగీనా నియోజకవర్గంలోకి రావడంతో మాయావతికి అది సురక్షిత నియోజకవర్గంగా చెబుతున్నారు. నగీనా నియోజకవర్గంలో 15 లక్షల మంది ఓటర్లు ఉండగా, వారిలో 4 లక్షల మందికి పైగా ముస్లింలు, దళితులు, యాదవ కులం ఓటర్లు ఉన్నారు.

Check Also

కన్నీరుపెట్టిస్తున్న ఓ అమర జవాను కథ…..

Share this on WhatsAppపుణె: వ్యాధితో బాధపడుతోందని తెలిసీ ప్రేమ వివాహం చేసుకుని ఓ యువతికి జీవితాన్ని ప్రసాదించాడు. ఎల్లప్పుడూ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *