Breaking News
Home / States / శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తే చర్యలు…

శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తే చర్యలు…

హైదరాబాద్‌: హైదరాబాద్ కమిషనర్ రేట్ పరిధిలో సైబర్ నేరాలపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాన్ని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా అంజనీకుమార్‌ మాట్లాడుతూ తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, శాంతిభద్రతల సమస్య సృష్టించాలని చూస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నగర ప్రజలంతా ప్రశాంతమైన వాతావరణంలో జీవిస్తున్నారని, హైదరాబాద్‌ ఐదేళ్లుగా వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ” హైదరాబాద్‌లో శాంతిభద్రతల సమస్య సృష్టికి కొందరు ప్రయత్నిస్తున్నారు. కశ్మీర్‌లో అల్లర్లు జరగుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అఫ్గానిస్థాన్‌, ఇరాక్‌లో జరిగిన పాత ఘటనలను వాట్సాప్‌లో పెడుతున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని అంజనీకుమార్‌ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డీజీ షికా గోయల్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *