Breaking News
Home / States / Andhra Pradesh / 13న కేంద్ర జలవనరుల మంత్రిని కలుస్తాం…

13న కేంద్ర జలవనరుల మంత్రిని కలుస్తాం…

గుంటూరు: గురువారం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గుంటూరులోని బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బాపూజీ 150వ జయంతిని పురస్కరించుకొని గాంధీ సంకల్ప యాత్ర చేపట్టనున్నట్టు, అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ పార్లమెంట్‌ సభ్యులు ఈ యాత్రలో పాల్గొననున్నట్లు వెల్లడించారు. బాపూజీ సిద్ధాంతాలు పాటించడం, ఆయన ఆశయాలు సాధించడం కోసమే ఈ యాత్ర చేపట్టనున్నట్టు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును రేపు సందర్శిస్తామనీ, ప్రస్తుతం ప్రాజెక్టు పురోగతి ఎలా ఉందో పరిశీలిస్తామన్నారు. ఈ నెల 13న ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖమంత్రిని కలుస్తామని, పోలవరం కచ్చితంగా పూర్తిచేయాలనేదే తమ పార్టీ సంకల్పమని కన్నా స్పష్టం చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *