హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అక్టోబర్2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో మెగా అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. అర్థరాత్రి నుంచే అభిమానులు థియేటర్ల వద్దకు చేరుకుని టపాసులు కాలుస్తు డ్యాన్స్‌లు చేస్తున్నారు. దీంతో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. కొన్ని థియేటర్ల వద్ద మెగాస్టార్ చిరంజీవి భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. మరికొన్నిచోట్ల మెగాస్టార్ కటౌట్లకు పాలాభిషేకాలు చేస్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకుడు . నయనతార కథానాయిక. అమితాబ్ బచ్చన్, తమన్నా, విజయ్ సేతుపతి, జగపతిబాబు, సుదీప్ కీలక పాత్రలు పోషించారు.
