Breaking News
Home / Film News / బాక్సర్‌గా అలరించనున్న మెగా ప్రిన్స్…

బాక్సర్‌గా అలరించనున్న మెగా ప్రిన్స్…

హైదరాబాద్‌: మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ బాక్సర్‌గా కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ‘గద్దలకొండ గణేష్‌’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న వరుణ్‌తేజ్‌. తాజాగా ఆయన 10వ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో గురువారం పూజా కార్యక్రమాలను నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. అల్లుఅరవింద్‌ సమర్పణలో కిరణ్‌ కొర్రపాటి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. డిసెంబర్‌ నుంచి ఈ సినిమా రెగ్యూలర్‌ షూటింగ్‌ జరగనుంది.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *