Breaking News
Home / Film News / మెగా అల్లుడి తాజా చిత్రం ఫస్ట్ లుక్‌ విడుదల….

మెగా అల్లుడి తాజా చిత్రం ఫస్ట్ లుక్‌ విడుదల….

ఫిల్మ్ న్యూస్: ‘విజేత’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్‌దేవ్, తొలి చిత్రంతో డీసెంట్ సక్సెస్‌ను సొంతం చేసుకున్నారు. అయితే ఆయన రెండో చిత్రం మొదలవడానికి కాస్త సమయం పట్టింది. రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రెండో చిత్రాన్ని చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘సూపర్‌మచ్చి’ అనే టైటిల్‌ను ఖరారు చేసి దీపావళి సందర్భంగా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

పులివాసు డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని రిజ్వాన్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ రెహ చక్రవర్తి హీరోయిన్‌గా నటిస్తుంది. 50 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. మ్యూజిక్ సెన్సేషనల్ ఎస్.ఎస్‌.తమన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *