Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / మెగాస్టార్ చిరంజీవి- జగన్ భేటీ వాయిదా…

మెగాస్టార్ చిరంజీవి- జగన్ భేటీ వాయిదా…

అమరావతి: టాలీవుడ్ ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి మధ్య శుక్రవారం ఉదయం 11 గంటలకు జరగాల్సిన భేటీ వాయిదా పడింది. నిజానికి వీరిద్దరి మధ్య భేటీని ముఖ్యమంత్రి కార్యాలయం ఖరారు చేసింది. చిరంజీవితోపాటు ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా ఈ భేటీకి హాజరు కావాల్సి ఉంది. అనుకున్న ప్రకారం శుక్రవారం ఉదయం జగన్‌తో చిరంజీవి భేటీ కావాల్సి ఉండగా, అనుకోని కారణాల వల్ల ఈ భేటీ 14వ తేదీకి వాయిదా పడింది. ‘సైరా’ సినిమాను వీక్షించమని కోరేందుకే జగన్‌తో చిరు భేటీ అవుతున్నారంటూ అనధికారిక వర్గాలు చెబుతున్నాయి.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *