Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / మెగాస్టార్ కు సీఎం అపాయింట్‌మెంట్ ఖరారు….

మెగాస్టార్ కు సీఎం అపాయింట్‌మెంట్ ఖరారు….

అమరావతి: కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అపాయింట్‌మెంట్ కోరారు. ఈ మేరకు సీఎంవో కార్యాలయం అపాయింట్‌మెంట్ ఖరారు చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం జగన్‌తో చిరంజీవి, రామ్ చరణ్ భేటీ అవుతారు. తాను కథానాయకుడిగా నటించిన చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ని వీక్షించడానికి రావాల్సిందిగా సీఎం జగన్‌ను చిరంజీవి కోరనున్నారు. జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చిరంజీవి తొలిసారి ఆయనతో భేటీ కాబోతున్నారు.

‘సైరా’ సినిమాను వీక్షించాల్సిందిగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను చిరంజీవి ఇటీవల కోరడం, ఆమె కుటుంబంతో కలిసి సినిమా చూసి అద్భుతంగా ఉందంటూ ప్రశంచిన విషయం తెలిసిందే. తొలితరం స్వాతంత్య్ర పోరాటయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మించిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంపై సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తుండడం విశేషం.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *