Breaking News
Home / States / మెట్రో అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి

మెట్రో అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి

హైదరాబాద్‌: మెట్రో రైలు స్టేషన్‌లలో భద్రతపై మెట్రో అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఇటీవల అమీర్‌పేట్ స్టేషన్ వద్ద జరిగిన దురదృష్టకర సంఘటనలో ఓ మహిళ మృతి చెందిన అనంతరం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావు మెట్రో యంత్రాంగంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం మెట్రో అధికార యంత్రాంగానికి మంత్రి కేటీఆర్ ప్రత్యేక సూచనలు చేయడంతో పాటు భద్రత, స్టేషన్‌ల వద్ద పరిస్థితులను సమగ్రంగా పరిశీలించడం, మరమ్మతులు చేపట్టడం వంటివి యుద్ద ప్రాతిపదికన చేయాలని ఆదేశించారు. ఈ మేరకు మెట్రో అధికార యంత్రాంగం వెంటనే మెట్రో మార్గంలోని అన్ని స్టేషన్‌లు, ఇతర నిర్మాణాలు, లిఫ్టులు, విద్యుత్ ఏర్పాట్లు వంటి విషయాలపై మరమ్మతులు చేపట్టింది. ఇందుకు ఎల్ అండ్ టి ఇంజనీరింగ్ నిపుణులతో కూడిన 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బూమ్‌లిఫ్టులు, ఫ్లడ్ లైట్లు వంటి వాటిల్లో ప్రత్యేక దృష్టి పెట్టనున్నాయి.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *