హైదరాబాద్: హైదరాబాద్ లోని ప్రగతిభవన్ సమీపంలో గల బేగంపేట మెట్రో స్టేషన్ మూసివేశారు. భద్రతా కారణాలతో మెట్రో స్టేషన్ మూసివేసినట్లు మెట్రో అధికారులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో మెట్రో స్టేషన్ ను అధికారులు క్లోజ్ చేశారు. నిరసన కారులు స్టేషన్లోకి చొచ్చుకు రావచ్చనే అనుమానాలతో ముందస్తు జాగ్రత్తగా బేగంపేట మెట్రో స్టేషన్ను మూసివేశారు.
