Breaking News
Home / Uncategorized / మెక్సికో 311 మంది భారతీయులను వెనక్కి పంపింది…..

మెక్సికో 311 మంది భారతీయులను వెనక్కి పంపింది…..

మెక్సికో సిటీ: సరైన అనుమతులు లేకుండా తమ దేశంలో ఉంటున్న 311 మంది భారతీయులను మెక్సికో అధికారులు వెనక్కి పంపించారు. ఈ మేరకు తమ దేశంలో ఉండేందుకు సరైన అనుమతులు లేని భారతీయులను టొలుకా విమానాశ్రయం నుంచి ప్రత్యేక బోయింగ్‌ 747 విమానంలో భారత్‌కు తిప్పి పంపినట్లు మెక్సికన్‌ జాతీయ వలసల సంస్థ (ఐఎన్‌ఎమ్‌) ఓ ప్రకటనలో పేర్కొంది. మెక్సికన్‌ సరిహద్దుల నుంచి పెరుగుతున్న వలసలను నివారించేందుకు ఆ దేశంపై టారిఫ్‌ల భారం పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బెదిరించిన నేపథ్యంలో మెక్సికో ఈ చర్యకు పూనుకుంది. సరిహద్దుల వెంబడి నిఘా పెంచడంతోపాటు వలసదారులను దేశంలోకి అనుమతించే పాలసీని సవరించాలని నిర్ణయించింది. అక్రమ వలసదారులను తిప్పి పంపించే విషయంలో భారతీయ దౌత్య కార్యాలయం మంచి సహకారం అందించిందని, కృతజ్ఞతలు తెలిపింది.

Check Also

అంతుచిక్కని మరో వైరస్.. వందలాది మంది మృతి

Share this on WhatsAppతమ పొరుగు దేశం కజకిస్థాన్‌లో అంతుచిక్కని వైరస్‌ కారణంగా వ్యాధులు ప్రబలి, వందలాది మంది మృత్యువాత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *