Breaking News
Home / Lifestyle / Business / మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్లకు జార్జ్ ఫ్లాయిడ్ నిరసనల సెగ…

మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్లకు జార్జ్ ఫ్లాయిడ్ నిరసనల సెగ…

సియాటెల్ పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే ఇతర చట్టబద్ధ సంస్థలతో మైక్రోసాఫ్ట్ కంపెనీ చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలని 250 మందికి పైగా మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ , సిఇఓ సత్య నాదెళ్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సమాచారం మీడియా కలకలం రేపుతోంది. జార్జ్ ఫ్లాయిడ్ మరణం తరువాత, అమెరికాలో అల్లర్లు చెలరేగాయి. టెక్నాలజీ అండ్ సైన్స్ ఆన్‌లైన్ పోర్టల్ ‘వన్‌జిరో.కామ్ మీడియం’ కథనం ప్రకారం నాదెళ్ల సహా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కర్ట్ డెల్బెన్‌కు సోమవారం పంపిన ఇమెయిల్‌లో 250 మందికి పైగా సిబ్బంది విజ్ఞప్తి చేసినట్లు కంపెనీ తెలిపింది. సియాటెల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ సమా ఇతర చట్టబద్ధ సంస్థలతో పాటు ఒప్పందాన్ని రద్దు చేయండనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. అలాగే ‘బ్లాక్ లైవ్స్ మేటర్’ ఉద్యమానికి అధికారికంగా మద్దతు ఇవ్వాలని, సియాటెల్ మేయర్ రాజీనామా చేయాలని ఉద్యోగులు కంపెనీకి విజ్ఞప్తి చేశారు.

Check Also

చైనాకు షాక్ ఇచ్చిన ఆపిల్, 4,500 యాప్స్ తొలగింపు

Share this on WhatsAppసరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాకు చెందిన 59 చైనీస్ యాప్స్‌ను ఇండియా నిషేధించిన విషయం తెలిసిందే…తాజాగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *