శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని శ్రీనగర్లో శనివారంనాడు ఉగ్రదాడి చోటుచేసుకుంది. హరి సింగ్ హై స్ట్రీట్ మార్కెట్ ప్రాంతంలో ఉగ్రవాదులు గ్రనేడ్ విసరడంతో ఏడుగురు గాయపడ్డారు. పేలుడు ధాటికి ఒక కారు ధ్వంసమైంది. క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుని ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నాయి.
