హైదరాబాద్ : హెచ్ఐసీసీలో రెండో రోజు వరల్డ్ డిజైన్ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ పాల్గొన్నారు. వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్, తెలంగాణ ప్రభుత్వం, ఇండియా డిజైన్ ఫోరం ఆధ్వర్యంలో సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్లో తొలిసారి వరల్డ్ డిజైన్ అసెంబ్లీ సమావేశాలు జరగడం సంతోషంగా ఉంది. ఔత్సాహికులను అన్ని విధాలా ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని అన్నారు. ఐటీ రంగంలో బెంగుళూరు కంటే హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. తెలంగాణ టూరిజం వేగంగా అభివృద్ధి చెందుతుంది. నేషనల్ డిజైన్ సెంటర్ను రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో ఏర్పాటు చేస్తుంది. హైదరాబాద్ గ్లోబల్ డిజైన్ డెస్టినేషన్ కాబోతుంది అని మంత్రి తెలిపారు.
