Breaking News
Home / States / Andhra Pradesh / కల్కి ఆశ్రమంపై మంత్రి తీవ్ర వ్యాఖ్యలు…

కల్కి ఆశ్రమంపై మంత్రి తీవ్ర వ్యాఖ్యలు…

చిత్తూరు: కల్కి ఆశ్రమంపై మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆశ్రమం పేరుతో కల్కి భగవాన్‌ అక్రమ ఆస్తులను కూడబెట్టారని, ప్రజా సంక్షేమం పేరుతో రూ.కోట్లు దోచుకున్నారని చెప్పారు. ‘ ప్రభుత్వ భూములు ఆక్రమించారని, ఇసుక అక్రమ రవాణా చేశారని, హిందూ సంప్రదాయాలను దెబ్బతీసేలా కల్కి ఆశ్రమం పని చేస్తోందన్నారు. కల్కి ఆశ్రమంలో భగవాన్‌ తనయుడు లోకేశ్‌ దాసోజి ఒక పార్టీకి కొమ్ముకాశారని, ఆశ్రమం వెనుక ఉన్న నిజాలు బయటపెట్టాలి’ అని అన్నారు. కల్కి అలియాస్‌ విజయ్‌ కుమార్‌ బతికే ఉన్నారా? అనే దానిపైనా అనుమానాలున్నాయని, ఒక వేళ ఆయన బతికే ఉంటే ఫోటోలు ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. కల్కి ఆశ్రమం ఆక్రమించిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *