సూర్యాపేట: హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలు టీఆర్ఎస్వైపే ఉన్నారని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. హుజూర్నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి గెలుపు ఖాయమని పేర్కొన్నారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. హుజూర్నగర్లో అభివృద్ధి పరుగులు పెట్టాలంటే సైదిరెడ్డి గెలవాలన్నారు. టీఆర్ఎస్కు వస్తున్న ఆదరణను చూసి కాంగ్రెస్, బీజేపీలు భయపడుతున్నాయన్నారు. కాంగ్రెస్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఓటమి ఖాయమని తెలిపారు. పద్మావతికి టికెట్ వద్దన్న రేవంత్రెడ్డి ఇప్పుడు అనుకూలంగా ప్రచారం చేయడం హాస్యాస్పదమన్నారు. ప్రజలు టీఆర్ఎస్కు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే సైదిరెడ్డిని గెలిపిస్తాయని.. హుజూర్నగర్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని మంత్రి పేర్కొన్నారు.
