Breaking News
Home / Entertainment / 14 వేల సినీ కుటుంబాలకు మంత్రి సాయం…

14 వేల సినీ కుటుంబాలకు మంత్రి సాయం…

హైదరాబాద్‌: తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ 14 వేల సినీ, టీవీ కార్మికుల కుటుంబాలకు సాయం చేయబోతున్నారు. కరోనా వల్ల లాక్‌డౌన్‌ విధించడంతో సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉపాధిలేక సతమతమౌతున్న వీరి ఆకలి తీర్చేందుకు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి ఇప్పటికే ‘కరోనా క్రైసిస్‌ ఛారిటీ’ (సీసీసీ)ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా విరాళాలు సేకరించి, సినీ కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు.

కాగా ఇప్పుడు సినీ, టీవీ కార్మికుల కోసం తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ముందుకొచ్చారు. వారికి నిత్యావసరాలు పంపిణీ చేయబోతున్నారు. అవసరం మేర పెద్దల సలహాలు, సూచనలు తీసుకుని మంత్రి ఈ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. 14 వేల మంది సినీ కార్మికుల కుటుంబాలకు నిత్యావసరాలు అందే వరకూ.. ఈ సేవా కార్యక్రమం కొనసాగనుందని మంత్రి వెల్లడించారు.

Check Also

ఏపీలో కొత్తగా 1608 కేసులు

Share this on WhatsAppఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నిత్యం వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *