హైదరాబాద్: దేశ విదేశాల్లో బతుకమ్మ పండుగను.. ఘనంగా జరుపుకోవడంలో తెలంగాణ జాగృతి సంస్థ చేసిన కృషి అమోఘమని మంత్రి కేటీఆర్ కొనియాడారు. పువ్వుల్ని పూజించే విశిష్ట సంప్రదాయాన్ని స్వరాష్ట్ర సాధనలో సాంస్కృతిక ఆయుధంగా మార్చిన ఘనత జాగృతిదేనన్నారు. బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేసిన సోదరి కవితకు.. జాగృతిలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కేటీఆర్ అభినందనలు తెలిపారు.
