Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / బాధ్యతలు చేపట్టిన ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

బాధ్యతలు చేపట్టిన ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

అమరావతి: ముఖ్యమంత్రి జగన్ కేబినెట్‌లో ఆర్థిక శాఖ, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రిగా నియమితులైన బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని 2వ బ్లాక్‌లో ఉన్న తన ఛాంబర్లో బాధ్యతలు చేపట్టారు. ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం 11.50 గంటలకు ఆయన తన సీటులో ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంత్రిగా తనకు ఈ అవకాశం ఇచ్చిన డోన్ నియోజకవర్గ ప్రజలకు, సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి తనవంతు బాధ్యతగా కష్టపడి పని చేస్తానన్నారు. విద్యార్థులకు, రైతులకు అందరికీ న్యాయబద్ధమైన పాలన అందిస్తామన్నారు. ప్రతి రూపాయి పొదుపు చేయటంతో పాటు చిత్త శుద్ధితో ఖర్చు పెడతామని, ఎన్నికల మేనిఫెస్టోలో వైసీపీ ఇచ్చిన అంశాలకు బడ్జెట్లో మొదటి ప్రాధాన్యత ఉంటుందని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు.

Check Also

ప్రతేక్య హోదాపై సభలో సీఎం ప్రకటన

Share this on WhatsAppప్రతేక్య హోదాపై సభలో సీఎం ప్రకటన అమరావతి: అసెంబ్లీ లో సీఎం జగన్ ప్రతేక్య హోదా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *