ఖమ్మం: గ్రామాల్లో అపరిశుభ్రతపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొణిజర్ల మండలం గుబ్బగుర్తి గ్రామంలో అపరిశుభ్రతపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుబ్బగుర్తి గ్రామంలో ఆకస్మిక పర్యటన చేసి గ్రామాన్ని సందర్శించారు. రోడ్ల పక్కన చెత్త వేయడం.. అలాగే కిరణా షాపు యజమాని ఖాళీ బాటిల్స్ బస్తాలు రోడ్డు పక్కనే ఉంచడంతో గ్రామ కార్యదర్శితో పాటు సర్పంచ్‌పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసారు. కిరణ షాపు యజమానికి రూ 5 వేలు ఫైన్ వేయాలని ఆదేశించారు. ఏన్కూరులో కూడా పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉండడంతో అసహానం వ్యక్తం చేశారు. డీపీవోని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. కొణిజర్ల, ఏన్కూర్ మండలంలో అపరిశుభ్రత పట్ల కలెక్టర్‌పై మంత్రి ఆగ్రహాం వ్యక్తంచేశారు.
