Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయం: మంత్రి సుచరిత

మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయం: మంత్రి సుచరిత

చల్లావారిపాలెం(గ్రామీణ గుంటూరు): మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం. దీని కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. నగర శివారు నల్లపాడులో గురువారం జీడీసీసీ సహకార బ్యాంకు మహిళా శాఖ ప్రారంభోత్సవం జరిగింది. బ్యాంకు ఛైర్మన్‌ రాతంశెట్టి సీతారామాంజనేయులు(లాలుపురం రాము) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అనంతరం సుచరిత మాట్లాడుతూ రాష్ట్రంలో మొదటి సారిగా మహిళల కోసం ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు చేసిన ఘనత జీడీసీసీకి దక్కుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా బ్యాంకుశాఖను ఏర్పాటు చేసిన ఛైర్మన్‌ రామును ఆమె అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి సుచరిత రూ.3 కోట్ల విలువైన చెక్కును మహిళా గ్రూపులకు అందించారు. బ్యాంకు ఛైర్మన్‌ రాము మాట్లాడుతూ బ్యాంకు శాఖ ద్వారా మహిళా గ్రూపులకు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నట్లు చెప్పారు. బంగారు నగలపై తక్కువ వడ్డీకే రుణాలు, సేఫ్‌ డిపాజిట్‌ లాకర్స్‌, నఫె్ట్‌ తదితర సౌకర్యాలు ఉన్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఆప్కాబ్‌ ఎండీ శ్రీనాథ్‌రెడ్డి, మెప్మా పీడీ బాలయ్య, సీఈవో కృష్ణవేణి, జనరల్‌ మేనేజర్‌ భాను తదితరులు పాల్గొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *