తూర్పు గోదావరి : రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖా మంత్రి కురసాల కన్నబాబు శుక్రవారం కరప మండలంలోని వేములవాడ, వాకాడ, యండమూరు గ్రామాలలో పర్యటిస్తున్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను పర్యవేక్షించి రైతులతో మాట్లాడనున్నారు. నాగులాపల్లి -రమణక్కపేట ప్రధాన రహదారిపై మోకాలి లోతు వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదకరమని తెలిసినప్పటికీ వరద నీటిలోనే ప్రయాణం చేస్తున్నారు.
