విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శుక్రవారం శ్రీ మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ దంపతులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. వైసీపీ ప్రభుత్వం సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తోందని తెలిపారు.
