హైదరాబాద్: నగరంలోని మాసబ్‌ట్యాంక్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ నేడు పలు ప్రభుత్వ కార్యాలయాలను ప్రారంభించారు. పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖల కార్యాలయాలను ప్రారంభించారు. మంత్రి ఇకనుంచి అధికారిక కార్యకలాపాలు ఇక్కడినుంచే నిర్వహించనున్నారు.
