Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / అసెంబ్లీలో అచ్చెన్న వర్సెస్ మంత్రి బుగ్గన….!

అసెంబ్లీలో అచ్చెన్న వర్సెస్ మంత్రి బుగ్గన….!

అమరావతి: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇవాళ అసెంబ్లీలో మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే వంశీ విషయంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుల మధ్య మాటల యుద్ధం జరిగింది. క్వశ్చన్‌ అవర్‌ పక్కనబెట్టి సభ్యుడితో ఎప్పుడూ మాట్లాడించలేదని.. టీడీపీ అధినేత చంద్రబాబును తిట్టించేందుకే ఆ సభ్యుడితో (వల్లభనేని) మాట్లాడించారని అచ్చెన్న వ్యాఖ్యానించారు. అయితే అచ్చెన్న మాట్లాడుతుండగా అధికార సభ్యులు అడ్డుతగిలారు. అయితే తన మాటలు వింటే మీకు నాలెడ్జ్‌ వస్తోందని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.

ఏం తెలుసుకోవాలి?
మరోవైపు.. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై మంత్రి బుగ్గన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వంశీ మాట్లాడితే టీడీపీ ఎందుకు ఉలిక్కి పడుతోంది? అని బుగ్గన ప్రశ్నించారు. అభివృద్ధి నిధులపై చంద్రబాబు హయాం నుంచే వివక్ష ఉందని.. 2016లో 40 మంది వైసీపీ సభ్యులు చంద్రబాబును కలిస్తే నిధులు ఇవ్వలేదని ఆర్థిక మంత్రి చెప్పుకొచ్చారు. అచ్చెన్నాయుడు నుంచి ఏం తెలుసుకోవాలి? అని ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. పార్టీతో సంబంధం లేకుండా అభివృద్ధి ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి నిర్ణయించారని బుగ్గన చెప్పుకొచ్చారు.

వంశీ ఏం మాట్లాడారు..!?
‘అసెంబ్లీలో నేను మాట్లాడుతుంటే టీడీపీ అధినేత చంద్రబాబు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు? నేను కూడా టీడీపీ సభ్యుడినే కదా..?. నాకు సభలో మాట్లాడే హక్కు లేదా?. నా నియోజకవర్గ సమస్యలపైనే సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డిని కలిశాను. ముఖ్యమంత్రిని ఎందుకు కలిశావని పేర్కొంటూ నన్ను టీడీపీ పార్టీ నుంచి తొలగించారు. పేదల కోసం వైఎస్‌ ఎన్నో మంచి పథకాలు తీసుకొచ్చారు. పోలవరం కుడికాలువపై మోటార్ల విషయం, ఇంగ్లీష్‌ మీడియం.. తదితర పథకాలు తీసుకువచ్చారు. రాష్ట్రంలో ఇసుక కొరతపై నా అభ్యంతరాలను టీడీపీ పట్టించుకోలేదు. పప్పు బ్యాచ్‌, పొట్టిరాయుళ్లు, పొలావ్‌ పొట్లాళ్లగాళ్లతో నన్ను తిట్టించారు. టీడీపీలో ఉండలేకపోతున్నాను.. నన్ను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించండి’ అని స్పీకర్‌ తమ్మినేనికి వల్లభనేని వంశీ విజ్ఞప్తి చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *