Breaking News
Home / States / ఆర్టీసీ సమ్మెపై మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌….

ఆర్టీసీ సమ్మెపై మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌….

హైదరాబాద్‌ : ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రయాణీకులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా వాహనాలను నడుపుతున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ స్పష్టం చేశారు. విద్యా సంస్థల సెలవులు ముగిసి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో మంత్రి పువ్వాడ అజయ్‌ కలెక్టర్లు, ఆర్టీసీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. త్వరలో 100 శాతం బస్సులు రోడ్ల మీద నడిచేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రయాణీకులకు తప్పని సరిగా టికెట్లు జారీ చేసేలా, వారి బస్‌ పాసులు ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరానికి అనుగుణంగా బస్సు డిపోల్లో కొత్తగా మెకానిక్‌లు, ఎలక్ట్రీషీయన్లు నియమించుకోవాలని ఆర్టీసీ అధికారులకు మంత్రి సూచించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *